సాధారణంగా, ఒక వ్యక్తి తన 16 నుండి 25 సంవత్సరముల మధ్యలో చాలా సాహస కృత్యాలు చేస్తూ ఉంటాడు. అందుకే జీవితం లో వచ్చే ఒడిదుడుకులను ఎలా అధిగమించాలో మనం నేర్చుకోవాలి. ఈ వయస్సులో మన ఆలోచనల కంటే కూడా మన పనులే చాలా వేగంగా వుంటాయి కాబట్టి, మనం చేసే పని ఏదైనా సరే మొట్ట మొదటి సారే సరిగా చేయటం అనేది చాల ముఖ్యం. మన స్నేహితులే మనకి ఆనందాన్ని ఇస్తారు. వారు మనలను చాల ప్రభావితం చేస్తారు. జీవితపు ఈ అంకం లో ధ్యానం మనకి చాలా మంచి మిత్రుడు..
#1 పరిస్థితులకు అనుగుణంగా వుండండి
“నేను కాలేజీ లో చదువుతున్నప్పుడు చాలా దూకుడు స్వభావం కలిగి, అందరితో గొడవపడి హింసాత్మకంగా వుండే వాడిని. దీనివలన నాకు స్నేహితులే లేకుండా అయిపొయి౦ది. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియలేదు. ధ్యానాన్ని ఆశ్రయించాను. ఇప్పుడు నేను చాల శాంతంగా వున్నాను మరియు చాల మంచి మిత్రులు కూడా వున్నారు”..... రాజేష్ నాయిర్
Bస్వాభావికంగా ప్రతి వ్యక్తీ స్నేహశీలే. కానీ మనలో వుండే ఒత్తిడి మరియు ఆందోళనల వల్ల వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వుంటాం. ధ్యానం ఒత్తిడిని తగ్గించేందుకు సహాయ పడుతుంది మన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింప చేస్తుంది. దీనివలన మనం చాలా సులభంగా స్నేహితులను సంపాదించుకుంటాం. వేరొకరి పట్ల శ్రద్ధ మరియు సంరక్షణ అనేవి మనకి సహజం అయిపోతాయి.
#2 మీ కలలని సాకారం చేసుకోండి
“ఒక మంచి గాయనిని అవ్వాలనేది నా ఆశయంగా వుండేది. కాని నా సామర్థ్యాన్ని నేనే శంకిస్తూ ఉండేదానిని. ధ్యాన సాధన వలన నాలో ఆత్మ విశ్వాసం వచ్చింది. ప్రతి వారమూ ప్రదర్శనలను ఇచ్చే ఒక మ్యూజిక్ బ్యాండ్ లో ఇప్పుడు నేనొక కళాకారిణిని.” – సజల్ జాజు
యువత గా మన కలలుఆశయాలు ఆకాశమే హద్దుగా వుంటాయి. ధ్యానం వలన వాటన్నింటినీ సాకారం చేసుకోగల శక్తిసామర్థ్యాలు మనకు లభిస్తాయి.
#3నూతనంగా ఆలోచించండి
“నిత్యంధ్యానాన్ని సాధన చేయడం వల్ల మనలోని ప్రతిభ బయటకు వస్తుంది. నేను నాలోని సృజనాత్మకతను వెలికి తీసి, నూతనంగా ఆలోచించ గలుగుతున్నాను. ధ్యానం, నేను చేసే ప్రతి పనిలో ఎదో ఒక తెలియని గొప్ప కోణాన్ని ఆవిష్కృతం చేస్తోంది”.....దివ్య సచ్ దేవ్
మనం ఒక మొబైల్ షాప్ కి వెళ్తే కొత్త మోడల్ ని కొంటాము ఎందుకంటే ఇతర సాధారణ నమూనాల కంటే అది వినూత్నంగా వుంది కాబట్టి.ధ్యానం చేసినప్పుడు, మనలో సృజనాత్మకత ఉదయిస్తుంది. కొత్తగా వైవిధ్యంగా ఆలోచించగలుగుతాము.
#4 మిమ్మల్ని ఏదీ కదిలించలేదు
““గతంలో ఇతరుల ప్రవర్తన వలన మరియు కొన్ని అయిష్టమైన పరిస్థితులలోను బాధ కలిగేది. కానీ ఇప్పుడు క్రమం తప్పకుండా ధ్యానం చెయ్యడం వలన జరిగే ప్రతీది సులభంగా అంగీకరించగలుగుతున్నాను” .... కరణ్ రాయ్
Aయవ్వనంలో తరచుగా మన జీవితాల్లో ఉత్పన్నమయ్యే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలా చికాకు కలుగవచ్చ. కొన్నిసార్లు కుప్పకుల్చేసినట్లు అనిపించవచ్చు. ధ్యానం వలన కఠినమైన పరిస్థితులని ఎదుర్కోడానికి కావలసిన మనోధైర్యం మరియు ప్రశాంతమైన చిత్తము లభిస్తాయి. అలాగే మంచి బాధ్యతగల మనిషిగా ఎదగడానికి కూడా ఎంతో ఉపకరిస్తుంది.వర్షాన్ని నియంత్రించడంమన చేతుల్లో లేదు, కానీ ఒక గొడుగు వుంటే ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళగలం. ధ్యానం సమస్యాత్మక కాలంలో గొడుగు వంటిది.s.
#5 ధ్యానంలో ఆనందస్థితికి చేరండి
“ఒకప్పుడు నేను ఏడు సంవత్సరాలపాటు విపరీతంగా పోగాతగేవాణ్ణి. నా స్నేహితుడు ధ్యానం చెయ్యమని సలహా ఇచ్చాడు. సహజసమాధి ధ్యానం క్రమం తప్పకుండా చెయ్యడం వలన పొగతాగే అలవాటు పూర్తిగా మానేసాను. పొగతాగిన తరువాత ఎంత ఆనందంగా వుంటుందో, ప్రతిరోజూ ధ్యానం తరువాత కూడా అంతేఆనందంగా వుంటుంది”......అర్జిత్ సింగ్
ధూమపానం తగ్గించడానికి లేదా పూర్తిగా మానెయ్యడానికి ధ్యానం శాశ్వత ప్రత్యామ్నాయంగా ఉపయోగి౦చ౦డి. అవగాహన ఆరోగ్యం కోల్పోకుండా సహజంగా ఆనందస్థితిలో వుండే మార్గం ధ్యానం. ధ్యానం మనసుని వ్యసనాలకు దూరంగా వుంచుతుంది. కాబట్టి ధూమపానాన్ని వదలండి ఆనందంగా జీవించండి!
#6 మీ శక్తిని సరైన మార్గంలో పెట్టండి
“ధ్యానం చెయ్యడం వలన ప్రతిరోజూ నేను ఎంతో శక్తివంతంగా ఉత్సాహభరితంగా వుంటున్నాను. మరిన్ని సృజనాత్మకమైన పనులు సేవా కార్యక్రమాలు చెయ్యగలుగుతున్నాను”....సాక్షి వర్మ
సముద్రమంత శక్తి ఉత్సాహం స్రుజనాత్మకత కలిగినవారు యువత. మన అంతరాల్లో దాగివున్న శక్తిని వెలికి తీసేందుకు ధ్యానం ఎంతో ఉపకరిస్తుంది. మనం మరింత శక్తివంతంగా ఉత్సాహభరితంగా సృజనాత్మకంగా వినూత్నంగా పనులు చేయ్యగాలుగుతము.
#7 మీ తల్లితండ్రులతో శాంతి ఒప్పందం చేసుకోండి
“ధ్యానం నాకు నా తల్లిదండ్రులతో ఒక విడదీయరాని బంధం నిర్మించడానికి దోహదపడింది....... ఇప్పుడు మేము మా సమస్యలు మరియు సంతోషాలు కలిసి పంచుకుంటాం. అందరం కలిసి చేసే ధ్యానం మా సంబంధాన్ని మరింత ప్రత్యేకం చేస్తుంది. "- అభిషేక్ దావర్
మీరు ధ్యానం చేసినప్పుడు, మీరుమీ తల్లిదండ్రులతో శాంతియుతంగా మరియు ఎంతో నైపుణ్యంగా విషయాలను చెప్పగలుగుతారు. ఇది మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ని అవగాహన లోపాన్ని తగ్గిస్తుంది.మీ కోరికలు మరియు మీ తల్లిదండ్రుల సూచనలు మధ్య సమతుల్యతను పెంచి మరింత అవగాహనతో సరైన ఎంపిక చేసుకోడానికి ధ్యానం సహాయపడుతుంది.